అవి కొండలలోని క్రూరపక్షులకును భూమిమీదనున్న మృగములకును విడువబడును వేసవికాలమున క్రూరపక్షులును శీతకాలమున భూమి మీదనున్న మృగములును వాటిని తినును.
యెషయా 14:19
నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు. ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్ప బడినవాడవైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివిబిలముయొక్క రాళ్లయొద్దకు దిగుచున్నవానివలెనున్నావు
యెషయా 34:1-7
1

రాష్ట్రములారా , నాయొద్దకు వచ్చి వినుడి జనములారా , చెవి యొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టిన దంతయు వినును గాక.

2

యెహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చు చున్నది వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చు చున్నది ఆయన వారిని శపించి వధకు అప్పగించెను .

3

వారిలో చంపబడినవారు బయట వేయబడెదరు వారి శవములు కంపు కొట్టును వారి రక్తమువలన కొండలు కరగిపోవును .

4

ఆకాశ సైన్య మంతయు క్షీణించును కాగితపు చుట్టవలె ఆకాశవైశాల్యములు చుట్టబడును . ద్రాక్షావల్లినుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపుచెట్టునుండి వాడినది రాలునట్లు వాటి సైన్య మంతయు రాలిపోవును .

5

నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఎదోము మీద తీర్పుతీర్చుటకు నేను శపించిన జనము మీద తీర్పుతీర్చుటకు అది దిగును

6

యెహోవా ఖడ్గము రక్త మయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్పబడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.

7

వాటితోకూడ గురుపోతులును వృషభములును కోడెలును దిగిపోవుచున్నవి ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది .

యిర్మీయా 7:33

ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహార మగును, వాటిని తోలివేయువాడు లేకపోవును.

యిర్మీయా 15:3

యెహోవా వాక్కు ఇదేచంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను.

యెహెజ్కేలు 32:4-6
4

నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసెదను , ఆకాశ పక్షు లన్నియు నీమీద వ్రాలునట్లుచేసి నీవలన భూ జంతువు లన్నిటిని కడుపార తిననిచ్చెదను,

5

నీ మాంసమును పర్వతముల మీద వేసెదను , లోయలన్నిటిని నీ కళేబరములతో నింపెదను .

6

మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును , లోయలు నీతో నింపబడును .

యెహెజ్కేలు 39:17-20
17

నర పుత్రుడా , ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సకలజాతుల పక్షులకును భూ మృగముల కన్నిటికిని యీ సమాచారము తెలియజేయుము నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కులనుండి కూడి రండి ; ఇశ్రాయేలీయుల పర్వతముల మీద నొక గొప్ప బలి జరుగును, మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు ;

18

బలాఢ్యుల మాంసము తిందురు , భూపతుల రక్తమును , బాషానులో క్రొవ్విన పొట్లేళ్ల యొక్కయు గొఱ్ఱపిల్లల యొక్కయు మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తము త్రాగుదురు .

19

నేను మీ కొరకు బలి వధింప బోవుచున్నాను, మీరు కడుపార క్రొవ్వు తిందురు , మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు .

20

నే నేర్పరచిన పంక్తిని కూర్చుండి గుఱ్ఱములను రౌతులను బలాఢ్యులను ఆయుధ స్థులను మీరు కడుపార భక్షింతురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .

ప్రకటన 19:17

మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని.

ప్రకటన 19:18

అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి -రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.