when
2 సమూయేలు 24:14

అందుకు దావీదు నాకేమియు తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యతగలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండ యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను.

2 దినవృత్తాంతములు 12:5

ప్రవక్తయైన షెమయా రెహబామునొద్దకును, షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.

కీర్తనల గ్రంథము 31:8

నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి.

వెళ్లి
నిర్గమకాండము 10:3

కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరి హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లకయుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.

2 దినవృత్తాంతములు 36:12

అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడచుచు, ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు, తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను.

యాకోబు 4:10

ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.