
నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.
నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము.
బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును.
అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.
ఇక జ్ఞానములేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.
జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువకఅపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
పనికిమాలినవారితో నేను సాంగత్యముచేయను వేషధారులతో పొందుచేయను.
దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యముచేయను
మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.