నీతి
ఆదికాండము 30:33

ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడ వచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియు, గొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్న యెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను.

ఆదికాండము 31:37

నీవు నా సమస్త సామగ్రి తడివి చూచిన తరువాత నీ యింటి వస్తువులన్నిటిలో ఏది దొరికెను? నావారి యెదుటను నీ వారియెదుటను అది యిట్లు తెచ్చిపెట్టుము; వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు.

1 సమూయేలు 12:3

ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా ? ఎవని గార్దభమునైన పట్టుకొంటినా ? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా ? న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా ? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తుననెను.

1 సమూయేలు 12:4

నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు ; ఏ మనుష్యునియొద్దగాని నీవు దేనినైనను తీసికొన లేదని వారు చెప్పగా

but
సామెతలు 5:22

దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.

1 రాజులు 2:32

నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, యెతెరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాశాయును అను తన కంటె నీతిపరులును యోగ్యులునగు ఈ ఇద్దరు మనుష్యులమీద పడి యోవాబు నా తండ్రియైన దావీదు ఎరుగకుండ కత్తిచేత వారిని చంపివేసెను గనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తలమీదికే రప్పించును.

1 రాజులు 2:33

మరియు వీరు ప్రాణ దోషమునకు యోవాబును అతని సంతతివారును సదాకాలము ఉత్తరవాదులు గాని, దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబికులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవావలన ఎన్నటెన్నటికిని కలిగి యుండును.

1 రాజులు 2:44

నీవు మా తండ్రియైన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియును. నీవు చేసిన కీడు యెహోవా నీ తలమీదికే రప్పించును.

కీర్తనల గ్రంథము 7:16

వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును.

ప్రసంగి 10:8

గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును; కంచె కొట్టువానిని పాము కరుచును.