ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము నెదుట దహన బలిపీఠమును ఉంచవలెను ;
మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకఱ్ఱతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను; దాని యెత్తు మూడు మూరలు.
దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడిరేకు పొదిగింపవలెను.
దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నియు ఇత్తడితో చేయవలెను.
మరియు వలవంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను.
ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను.
మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడిరేకు పొదిగింపవలెను.
ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండవలెను.
పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను.
మరియు అతడు తుమ్మ కఱ్ఱతో దహన బలిపీఠమును చేసెను . దాని పొడుగు అయిదు మూరలు దాని వెడల్పు అయిదు మూరలు , అది చచ్చౌకమైనది . దాని యెత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను .
దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి ; దానికి ఇత్తడిరేకు పొదిగించెను .
అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణము లన్నిటిని , అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను . దాని ఉపకరణము లన్నిటిని ఇత్తడితో చేసెను
ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను .
మరియు అతడు ఆ యిత్తడి జల్లెడయొక్క నాలుగు మూలలలో దాని మోతకఱ్ఱ లుండు నాలుగు ఉంగరములను పోతపోసెను .
ఆ మోతకఱ్ఱలను తుమ్మ కఱ్ఱతో చేసి వాటికి రాగిరేకులు పొదిగించెను .
ఆ బలిపీఠమును మోయుటకు దాని ప్రక్కల నున్న ఉంగరములలో ఆ మోతకఱ్ఱలు చొనిపెను ; పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను .
అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా?
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే , క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు.
పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని
క్రీస్తుయేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను . దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము , తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.
మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
కాబట్టి ప్రభువు నాకుసహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైనవాటిని తినుటకు గుడారములో సేవచేయువారికి అధికారములేదు.
నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసిన దేమనగా , ఏడాదివి రెండు గొఱ్ఱపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొఱ్ఱపిల్లను
సాయంకాల మందు ఒక గొఱ్ఱపిల్లను అర్పింపవలెను .
దంచితీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలెను . సాయంకాల మందు రెండవ గొఱ్ఱపిల్లను అర్పింపవలెను .
అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను .
ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి . నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును .
అక్కడికి వచ్చి ఇశ్రాయేలీ యులను కలిసికొందును ; అది నా మహిమవలన పరిశుద్ధపరచబడును .
నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను . నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను .
నేను ఇశ్రాయేలీ యుల మధ్య నివసించి వారికి దేవుడనై యుందును .
కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశము లోనుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలిసికొందురు . నేను వారి దేవుడనైన యెహోవాను .