సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను .
మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.
ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.
మరియు అతడు ఆవరణము చేసెను . కుడివైపున , అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగుగలవియు పేనిన సన్ననారవియునైన తెరలుండెను .
వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది . ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి .
ఉత్తర దిక్కున నున్న తెరలు నూరు మూరలవి ; వాటి స్తంభములు ఇరువది , వాటి యిత్తడి దిమ్మలు ఇరువది , ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి .
పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి ; వాటి స్తంభములు పది , వాటి దిమ్మలు పది , ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి .
తూర్పువైపున , అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు ;
ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదు నైదు మూరలవి ; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు .
అట్లు రెండవ ప్రక్కను , అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదు నైదు మూరల తెరలు ఉండెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు .
ఆవరణము చుట్టునున్నదాని తెర లన్నియు పేనిన సన్ననారవి .
స్తంభముల దిమ్మలు రాగివి , స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి . వాటి బోదెలకు వెండిరేకులు పొదిగింపబడెను . ఆవరణపు స్తంభము లన్నియు వెండి బద్దలతో కూర్ప బడెను.
ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్త వర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటా పనిది . దాని పొడుగు ఇరువది మూరలు ; దాని యెత్తు , అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా, అయిదు మూరలు .
వాటి స్తంభములు నాలుగు , వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు . వాటి వంకులు వెండివి .
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము.
సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,
ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,