నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించు చున్నాను; వాని పంప నొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెల విచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను.
నిర్గమకాండము 11:5

అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతువులలోను తొలిపిల్లలన్నియు చ

నిర్గమకాండము 12:29

అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీయొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలనందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతముచేసెను.

కీర్తనల గ్రంథము 78:51

ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను .

కీర్తనల గ్రంథము 105:36

వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమసంతానమును ఆయన హతముచేసెను .

కీర్తనల గ్రంథము 135:8

ఐగుప్తులో మనుష్యుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతముచేసెను.