నలువది వెండి దిమ్మలను
నిర్గమకాండము 26:25

పలకలు ఎనిమిది; వాటి వెండిదిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలుండవలెను.

నిర్గమకాండము 26:37

ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.

నిర్గమకాండము 27:10

దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

నిర్గమకాండము 27:12-18
12

పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది.

13

తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు.

14

ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.

15

రెండవ ప్రక్కను పరునైదుమూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు.

16

ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు.

17

ఆవరణముచుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి.

18

ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబదిమూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి.

నిర్గమకాండము 36:24-26
24

ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను.

25

మందిరముయొక్క రెండవ ప్రక్కకు, అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను,

26

అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేసెను.

నిర్గమకాండము 38:27

ఆ నాలుగు వందల వెండి మణుగులతో పరిశుద్ధస్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలును ; అనగా ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నాలుగు వందల మణుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను .

నిర్గమకాండము 38:30

అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లెడను వేదిక ఉపకరణము లన్నిటిని

నిర్గమకాండము 38:31

చుట్టునున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకు లన్నిటిని చుట్టునున్న ఆవరణమునకు మేకు లన్నిటిని చేసెను .

నిర్గమకాండము 40:18

యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి

సంఖ్యాకాండము 3:36

మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని

సంఖ్యాకాండము 4:31

ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పనిఅంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డ కఱ్ఱలను దాని స్తంభములను

సంఖ్యాకాండము 4:32

దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావలసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలెను.

పరమగీతములు 5:15

అతని కాళ్లు మేలిమిబంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములవలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము