మరియు మోషే ఇట్లనెనుయెహోవా ఆజ్ఞాపించినదే మనగానేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను.
కీర్తనల గ్రంథము 103:1

నా ప్రాణమా , యెహోవాను సన్నుతించుము . నా అంతరంగముననున్న సమస్తమా , ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము .

కీర్తనల గ్రంథము 103:2

నా ప్రాణమా , యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము

కీర్తనల గ్రంథము 105:5

ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా ఆయన యేర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకముచేసికొనుడి

కీర్తనల గ్రంథము 111:4

ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు . యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు

కీర్తనల గ్రంథము 111:5

తనయందు భయభక్తులుగలవారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసికొనును .

లూకా 22:19

పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి , వారి కిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము ; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని చెప్పెను .

హెబ్రీయులకు 2:1

కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను.