
యెహోవా పట్టణములోనుండి పాపము చేయువారినందరిని నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరిని ప్రతి ఉదయమున నేను సంహరించెదను.
మోయాబు శృంగము నరికివేయబడియున్నది దాని బాహువు విరువబడియున్నది యెహోవా వాక్కు ఇదే.
యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా
వీరేమి చేయబోవుచున్నారని నేనడిగి నందుకు ఆయన-ఎవడును తలయెత్తకుండ యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును, యూదాదేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.
వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీదయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది.
గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని.
ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించియున్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులగు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి.
ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను