నా అపరాధములు
కీర్తనల గ్రంథము 17:3

రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాటచేత నేను అతిక్రమింపను

కీర్తనల గ్రంథము 19:12

తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్నునిర్దోషినిగా తీర్చుము.

కీర్తనల గ్రంథము 44:20
మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల
కీర్తనల గ్రంథము 44:21
హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?
hid
కీర్తనల గ్రంథము 38:9
ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు.
యిర్మీయా 16:17

ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగైయుండదు.