అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.
నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వువేయుదురు లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు
యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు .
నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయనయందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధిచేయుటకై
అది చక్కని ఫలముగల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను; గొప్ప తుపాను ధ్వనితో దానిమీద మంటపెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి.
అతని కొమ్మలు విశాలముగా పెరుగును , ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును , లెబానోనుకున్నంత సువాసన అతనికుండును.
అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు . ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు . లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు .
ఎఫ్రాయిమూ బొమ్మలతో నాకిక నిమిత్తమేమి ? నేనే ఆలకించుచున్నాను , నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురుపెట్టు సరళవృక్షమువంటి వాడను, నావలననే నీకు ఫలము కలుగును .
నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా
వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును
తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.