Yea
కీర్తనల గ్రంథము 22:13

చీల్చుచును గర్జించుచునుండు సింహమువలె వారు నోళ్లు తెరచుచున్నారు

యెషయా 9:12

తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులును నోరు తెరచి ఇశ్రాయేలును మింగివేయవలెనని యున్నారు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు.ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

లూకా 11:53

ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి , ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి ,

లూకా 11:54

వెదకుచు చాలసంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి .

Aha
కీర్తనల గ్రంథము 40:15

నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయమొందుదురు గాక.

కీర్తనల గ్రంథము 54:7

ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించియున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది.

కీర్తనల గ్రంథము 70:3

ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక