
యెహోవా వాక్కుచేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను.
యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక
ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచియున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు.
దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.
నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా , ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము .
నీ విశ్వాస్యత తరతరములుండును . నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది
సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడియున్నవి
ఏలయనగా ఆకాశ మందున్నవియు భూమి యందున్నవియు , దృశ్యమైనవిగాని , అదృశ్యమైనవిగాని , అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను , సర్వమును ఆయన యందు సృజింపబడెను , సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను .
ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు .
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి.