మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?
మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా ?(సెలా.)
సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా ? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పుకొందురా?
అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా ? పాతాళములో నీ నీతి తెలియనగునా ?
మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు
మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి .
నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను .
చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
పాతాళమున నీకు స్తుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్ర యించరు .