A. M. 2942. B.C. 1062. Deliver
కీర్తనల గ్రంథము 43:1
దేవా, నాకు న్యాయము తీర్చుము భక్తిలేని జనముతో నా పక్షమున వ్యాజ్యె మాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
కీర్తనల గ్రంథము 59:1-3
1

నా దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను తప్పింపుము. నామీద పడువారికి చిక్కకుండ నన్ను ఉద్ధరించుము.

2

పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము.

3

నా ప్రాణము తీయవలెనని వారు పొంచియున్నారు యెహోవా, నా దోషమునుబట్టి కాదు నా పాపమునుబట్టి కాదు ఊరకయే బలవంతులు నాపైని పోగుబడియున్నారు.

కీర్తనల గ్రంథము 71:4
నా దేవా, భక్తిహీనుల చేతిలోనుండి నన్ను రక్షిం పుము. కీడు చేయువారి పట్టులోనుండి బలాత్కారుని పట్టులోనుండి నన్ను విడిపింపుము.
బలాత్కారము చేయువారి
కీర్తనల గ్రంథము 140:4
యెహోవా, భక్తిహీనుల చేతిలోపడకుండ నన్ను కాపా డుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షిం పుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దే శించుచున్నారు.
కీర్తనల గ్రంథము 140:11
కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక.
కీర్తనల గ్రంథము 18:48
ఆయన నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును.నా మీదికి లేచువారికంటె ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువుబలాత్కారముచేయు మనుష్యుల చేతిలోనుండినీవు నన్ను విడిపించుదువు
హబక్కూకు 1:2

యెహోవా , నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు ? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షిం పక యున్నావు .

హబక్కూకు 1:3

నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు ? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు ? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి , జగడమును కలహమును రేగుచున్నవి .