తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను
కీర్తనల గ్రంథము 44:1-3
1

దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసినపనినిగూర్చి మేము చెవులార వినియున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి

2

నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి.

3

వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను.

కీర్తనల గ్రంథము 78:55

వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను . కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచియిచ్చెను . ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను .

కీర్తనల గ్రంథము 136:21

ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును.

కీర్తనల గ్రంథము 136:22

తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును.

సంఖ్యాకాండము 33:54

మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రములచొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.

యెహొషువ 11:23

యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రములచొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని నప్పగించెను. అప్పుడు యుద్ధములేకుండ దేశము సుభిక్షముగా నుండెను.

యెహొషువ 12:7

యొర్దానుకు అవతల, అనగా పడమటిదిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని శేయీరు వరకునుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులును జయించిన దేశపురాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను.