నేను వాటిని మన్నించుచున్నాను
కీర్తనల గ్రంథము 119:6

నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు.

కీర్తనల గ్రంథము 19:7

యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.

కీర్తనల గ్రంథము 19:8

యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.

ద్వితీయోపదేశకాండమ 4:8

మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?

యోబు గ్రంథము 33:27

అప్పుడు వాడు మనుష్యులయెదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైనదానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడ లేదు

సామెతలు 30:5

దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.

రోమీయులకు 7:12

కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది , ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది.

రోమీయులకు 7:14

ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము ; అయితే నేను పాపము నకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను .

రోమీయులకు 7:16

ఇచ్ఛ యింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదై నట్టు ఒప్పుకొనుచున్నాను .

రోమీయులకు 7:22

అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను గాని

నేను
కీర్తనల గ్రంథము 119:104

నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నియు నా కసహ్యములాయెను .

కీర్తనల గ్రంథము 119:118

నీ కట్టడలను మీరినవారినందరిని నీవు నిరాకరించుదువు వారి కపటాలోచన మోసమే .