యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.
వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.
యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.
స్నేహితునియందు నమ్మిక యుంచవద్దు ,ముఖ్యస్నేహితుని నమ్ముకొనవద్దు , నీ కౌగిటిలో పండుకొనియున్న దానియెదుట నీ పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము .
కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లిమీదికిని కోడలు అత్తమీదికిని లేచెదరు , ఎవరి ఇంటివారు వారికే విరోధు లగుదురు.
అయినను యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను , రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును , నా దేవుడు నా ప్రార్థన నాలకించును .