నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను
కీర్తనల గ్రంథము 22:23

యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్థులారా, మీరందరు ఆయనను ఘన పరచుడి ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరు ఆయనకు భయపడుడి

కీర్తనల గ్రంథము 22:24

ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.

కీర్తనల గ్రంథము 69:33
యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించు వాడు కాడు.
కీర్తనల గ్రంథము 69:34
భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక సముద్రములును వాటియందు సంచరించు సమస్త మును ఆయనను స్తుతించును గాక.
కీర్తనల గ్రంథము 116:1
యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను.
and art
కీర్తనల గ్రంథము 118:14
యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను.
నిర్గమకాండము 15:2

యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను.ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమనుతించెదను.

యెషయా 12:2
ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను
యెషయా 49:8
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనుకూలసమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణదినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని.