నీ దేవుడు ఏమాయెనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను.
నీ దేవుడు ఏమాయెనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు తమ దూషణలచేత నా యెముకలు విరుచుచున్నారు.
వారి దేవుడెక్కడనున్నాడని అన్యజనులు పలుకనేల ? మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమునుగూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము .
ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొనిపోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్లుకొని నీవు
కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన యెడల నీ కీర్తినిగూర్చి వినిన జనములు
ప్రమాణ పూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు.
వారిని దూరమునకు చెదరగొట్టెదను వారి పేరు మనుష్యులలో లేకుండ చేసెదననుకొందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో
ఇదంతయు యెహోవా చేసినదికాదు మా బలముచేత వారిని గెలిచితివిు అని వారనుకొందురేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు.
యూదారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి యెరూషలేము అష్షూరురాజుచేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని యున్న నీ దేవునిచేత మోసపోకుము.
ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవుమాత్రము తప్పించుకొందువా?
నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారు గాని హారానువారు గాని, రెజెపులు గాని, తెలశ్శారులో నుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?
హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వియీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి?
హిజ్కియా దూతలచేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి
యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవైయున్నావు.
యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవిని బెట్టుము.
యెహోవా, అష్షూరురాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి
వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి.
యెహోవా మా దేవా; లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలిసికొనునట్లుగా అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము.
యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా, నీ జనులయెడల జాలిచేసి కొని, అన్య జనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులు వారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.