
అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి .
ఆపత్కాలమునందు నీవు మొఱ్ఱపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగుచోటులోనుండి నీకు ఉత్తరమిచ్చితిని మెరీబా జలములయొద్ద నిన్ను శోధించితిని .(సెలా.)
ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి.
అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను.
అవి మెరీబా జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను.
అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొనిపోరని చెప్పెను.
యెహోవా ఎదోము పొలిమేరలయొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
అహరోను తన పితరులతో చేర్చబడును; ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు.
నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు.
ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నుల యెదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే.
మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు.
యెహోవా మిమ్మును బట్టి నామీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను చాలును; ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాటలాడవద్దు.
మరియు యెహోవా మిమ్మును బట్టి నామీద కోపపడి నేను ఈ యొర్దాను దాటకూడదనియు, నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న యీ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను.