
ఇశ్రాయే లీయులతో యెహోవా సెలవిచ్చునదేమనగా -నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు.
బేతేలును ఆశ్రయిం పకుడి, గిల్గాలులో ప్రవేశిం పకుడి, బెయేర్షెబాకు వెళ్ల కుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్య మగును.
యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయ లేకుండ అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాని నాశనముచేయును.
విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి.
దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహో వాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.
ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.
యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.
నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.
నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను.