
అయితే నీ యింటివారిలో శేషించినవారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతనియొద్దకు వచ్చి దండముపెట్టి –నేను రొట్టె ముక్క తినునట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక దానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు.
ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతనిమీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తు ననుకొని -ఇప్పుడు నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువని దావీదు తో చెప్పి
తన సేవకులను పిలిపించి-మీరు దావీదు తో రహస్యముగా మాటలాడి -రాజు నీయందు ఇష్టము గలిగియున్నాడు, అతని సేవకు లందరును నీయెడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.
సౌలు సేవకులు ఆ మాటలనుబట్టి దావీదుతో సంభాషింపగా దావీదు -నేను దరిద్రుడనై యెన్నికలేని వాడనై యుండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా? అని వారితో అనగా
సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి.
అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలెనన్న తాత్పర్యము గలవాడై-రాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను.
సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై
సౌలు వారితో ఇట్లనెను -మీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును గాక.
మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదయినది, అతనిని చూచినవాడు ఎవడయినది నిశ్చయముగా తెలిసికొనుడి; అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక
మరియు తనకు నమస్కారము చేయుటకై యెవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దుపెట్టుకొనుచు వచ్చెను.