it is come
యోబు గ్రంథము 3:25

ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియేనాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.

యోబు గ్రంథము 3:26

నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.

నీవు కలవరపడుచున్నావు
సామెతలు 24:10

శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకానివాడవగుదువు.

2 కొరింథీయులకు 4:1

కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడినవారమై అధైర్యపడము.

2 కొరింథీయులకు 4:16

కావున మేము అధైర్యపడము; మా బాహ్యపురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు.

హెబ్రీయులకు 12:3

మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.

హెబ్రీయులకు 12:5

మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము

అది నీకు తగులగా
యోబు గ్రంథము 1:11

అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా

యోబు గ్రంథము 2:5

ఇంకొకసారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను.

యోబు గ్రంథము 19:21

దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీదజాలిపడుడి.