మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని, మీయెడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని.
ఎవడైనను దుఃఖము కలుగజేసియుండిన యెడల,నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకందరికిని దుఃఖము కలుగజేసియున్నాడు. నేను విశేషభారము వానిమీద మోపగోరక యీ మాట చెప్పుచున్నాను.
అట్టివానికి మీలో ఎక్కువమందివలన కలిగిన యీ శిక్షయే చాలును
నేను వ్రాసిన పత్రికవలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను; నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలముమట్టుకే దుఃఖపెట్టెనని తెలిసికొనియున్నాను.
మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మావలన మీరు నష్టము పొందకుండుటకై, దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి.
దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.
నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది.
నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలెనున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగానున్నది.
నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను.
కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను, ఒకడు తప్పకుండ వీధిలోనున్న పసిపిల్లలమీదను ¸యవనుల గుంపుమీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను, భార్యా భర్త లును వయస్సు మీరినవారును వృద్ధులును పట్టుకొనబడెదరు.
ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.
మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;