వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము బోధింపతగునని నేననుకొంటిని;
యోబు గ్రంథము 8:8-10
8

మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు భూమిమీద మన దినములు నీడవలెనున్నవి.

9

మునుపటి తరమువారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసికొనుము.

10

వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపుదురు గదా వారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.

యోబు గ్రంథము 12:12

వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది. అని మీరు చెప్పుదురు

1 రాజులు 12:6-8
6

అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను బ్రదికియున్నప్పుడు అతని సముఖమందు సేవచేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరమిచ్చెదనని వారి నడుగగా

7

వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరమిచ్చినయెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి.

8

అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి, తనతో కూడ పెరిగిన ¸యవనులను పిలిచి ఆలోచన నడిగి, వారికీలాగు ప్రశ్నవేసెను

కీర్తనల గ్రంథము 34:11

పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.

కీర్తనల గ్రంథము 34:12

బ్రతుక గోరువాడెవడైననున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?

సామెతలు 1:1-4
1

దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొ మోను సామెతలు.

2

జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును

3

నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును

4

జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును¸ యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.

సామెతలు 16:31

నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగియుండును.

హెబ్రీయులకు 5:12

కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారైయుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.