I brake
కీర్తనల గ్రంథము 3:7

యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే.

కీర్తనల గ్రంథము 58:8

వారు కరగిపోయిన నత్తవలెనుందురు సూర్యుని చూడని గర్భస్రావమువలెనుందురు.

సామెతలు 30:14

దేశములో ఉండకుండ వారు దరిద్రులను మింగునట్లును మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయునట్లును ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లునుగలవారి తరము కలదు.

దవడపళ్లను
1 సమూయేలు 17:35

నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱను విడిపించితిని ; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని .

కీర్తనల గ్రంథము 124:3
యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు
కీర్తనల గ్రంథము 124:6
వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.