
దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలముచేయును గాక.
నేను నిన్ను నీ పితరులయొద్ద చేర్చుదును; నీవు నెమ్మది నొందినవాడవై సమాధికి చేర్చబడుదువు.నేను ఈ స్థలముమీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు; ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానమును రాజు నొద్దకు తెచ్చిరి.
నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారని యెవనికిని తోచదు .
తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు.
వారి గుడారములో వెలుగు అంధకారమగును వారియొద్దనున్న దీపము ఆరిపోవును
జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురు భూలోకములోనుండి వారిని తరుముదురు.
నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు.నా త్రోవలను చీకటి చేసియున్నాడు
నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుట లేదా?నిన్ను ముంచబోవు ప్రళయజలములను నీవు చూచుట లేదా?