మాటలను గద్దించుదమని మీరనుకొందురా?నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా.
ఎంత కాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలివంటివాయెను.
జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా?
నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపినందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.
వారు ఎలీహుకన్న ఎక్కువ వయస్సుగలవారు గనుక అతడు యోబుతో మాటలాడవలెనని కనిపెట్టియుండెను.
అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తరమేమియు ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను.
కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాటలాడసాగెను నేను పిన్నవయస్సుగలవాడను మీరు బహు వృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు.
ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభముకొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయు చున్నారు.
నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్య మైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.