నా మాట ఆలకింపుము
యోబు గ్రంథము 5:27

మేము ఈ సంగతి పరిశోధించి చూచితివిు, అది ఆలాగేయున్నది.

యోబు గ్రంథము 13:5

మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.

యోబు గ్రంథము 13:6

దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెమునాలకించుడి.

యోబు గ్రంథము 33:1

యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవినిబెట్టుము.

యోబు గ్రంథము 34:2

జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి

యోబు గ్రంథము 36:2

కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసెదను. ఏలయనగా దేవునిపక్షముగా నేనింకను మాటలాడవలసియున్నది.