
ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును;
అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.
పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను.
నరులతోకూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.
నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమైపోతిని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను.
దేవుడు వాని కొట్టివేయునప్పుడు వాని ప్రాణము తీసివేయునప్పుడు భక్తిహీనునికి ఆధారమేది?
నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని.
యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలతజెందితిని
అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు మన యెముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతివిు అని యనుకొనుచున్నారు
నా ప్రాణముతో– ప్రాణమా, అనేక సంవత్సరములకు,విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను.
అయితే దేవుడు–వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను.