నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు.ఇదికూడ నామీద సాక్ష్యముగా నున్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది.
నేను సమృధ్దిగల దాననై వెళ్లితిని , యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను . మీరు నన్ను నయోమి అని పిలువ నేల ? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను , సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను .
పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తరమిచ్చును.
మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను ఈ కుండలోనుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది.
ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారైయెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును.
దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు.
నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా చేసియున్నాడు.తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు
ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి కనికరములేక నా తుండ్లను పొడిచెను నా పైత్యరసమును నేలను పారబోసెను.
కన్నముమీద కన్నమువేసి ఆయన నన్ను విరుగగొట్టెను పరుగులెత్తి శూరునివలె నామీద పడెను.
నా చర్మముమీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని నా కొమ్మును ధూళితో మురికిచేసితిని.
నాచేత బలాత్కారము జరుగకపోయినను నా ప్రార్థన యథార్థముగానుండినను
ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరు తెలిసికొనుడి.
నామీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.
నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు.నా త్రోవలను చీకటి చేసియున్నాడు
ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.
నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమైపోతిని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను.
ఆయన నామీద తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.