చింపుకొని
ఆదికాండము 37:29

రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని

ఆదికాండము 37:34

యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా

ఎజ్రా 9:3

నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, నా తల వెండ్రుకలను నా గడ్డపు వెండ్రుకలను పెరికివేసికొని విభ్రాంతిపడి కూర్చుంటిని.

సాష్టాంగపడి
ద్వితీయోపదేశకాండమ 9:18

మీరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి, మునుపటివలె అన్నపానములు మాని నలువది పగళ్లు నలువది రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని.

2 సమూయేలు 12:16-20
16

యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను.

17

దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడియుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికయైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయకయుండెను.

18

ఏడవ దినమున బిడ్డ చావగా –బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటిలాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను.

19

ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనము అతనితో చెప్పినయెడల తనకుతాను హాని చేసికొనునేమో యనుకొని, దావీదు సేవకులు బిడ్డ చనిపోయెనను సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయెనను సంగతి గ్రహించి –బిడ్డ చనిపోయెనా అని తన సేవకులనడుగగా వారు –చనిపోయెననిరి.

20

అప్పుడు దావీదు నేలనుండి లేచి స్నానముచేసి తైలము పూసికొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన యింటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి; అప్పుడు అతడు భోజనము చేసెను.

2 దినవృత్తాంతములు 7:3

అగ్నియు యెహోవా తేజస్సును మందిరముమీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగనమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి.

మత్తయి 26:39

కొంత దూరము వెళ్లి, సాగిలపడి– నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.

1 పేతురు 5:6

దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.