వారు ఒక పోతదూడను చేసికొనిఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, నీకు బహు విసుకు పుట్టించినను
నిర్గమకాండము 32:4-8
4

అతడు వారి యొద్ద వాటిని తీసికొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.

5

అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను–రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా

6

మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.

7

కాగా యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి.

8

నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించి–ఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశమునుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.

నిర్గమకాండము 32:31-8
నిర్గమకాండము 32:32-8
ద్వితీయోపదేశకాండమ 9:12-16
12

–నీవు లేచి యిక్కడ నుండి త్వరగా దిగుము; నీవు ఐగుప్తులోనుండి రప్పించిన నీ జనము చెడిపోయి, నేను వారి కాజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మను చేసికొనిరని నాతో చెప్పెను.

13

మరియు యెహోవా– నేను ఈ ప్రజలను చూచితిని; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు.

14

నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండ తుడుపుపెట్టి, నిన్ను వారికంటె బలముగల బహు జనముగా చేసెదనని నాతో చెప్పగా.

15

నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని. కొండ అగ్నిచేత కాలుచుండెను, ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను.

16

నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసియుంటిరి. పోతదూడను చేయించుకొని యెహోవా మీకాజ్ఞాపించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి యుంటిరి.

కీర్తనల గ్రంథము 106:19-23
19

హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి

20

తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి.

21

ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను

22

ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.

23

అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసెదననెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను

యెహెజ్కేలు 20:7-44
7

అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడు తన కిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుటచేత మిమ్మును మీరు అపవిత్రపరచు కొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించితిని.

8

అయితే వారు నా మాట విన నొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మాన లేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మాన లేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని యనుకొంటిని.

9

అయితే ఏ అన్యజనుల యెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనతకొరకు నేను వారిని ఐగుప్తు దేశము లోనుండి రప్పించితిని.

10

వారిని ఐగుప్తు దేశములోనుండి రప్పించి అరణ్యము లోనికి తోడుకొని వచ్చి

11

వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైన వాటి ననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును.

12

మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని.

13

అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుస రింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్యమందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని.

14

అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో యే అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి యెదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని.

15

మరియు తమకిష్టమైన విగ్రహముల ననుసరింపవలెనని కోరి, వారు నా విధులను తృణీకరించి నా కట్టడల ననుస రింపక నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా

16

ఇచ్చెదనని నేను సెలవిచ్చి నట్టియు, పాలు తేనెలు ప్రవహించునట్టియునైన సకల దేశములకు ఆభరణమగు దేశము లోనికి వారిని రప్పిం పనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని.

17

అయినను వారు నశించి పోకుండునట్లు వారియందు కనికరించి, అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయక పోతిని.

18

వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లల తో ఈలాగు సెలవిచ్చితిని మీరు మీ తండ్రుల ఆచారములను అనుస రింపకయు, వారి పద్ధతులనుబట్టి ప్రవర్తిం పకయు, వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచు కొనకయు నుండుడి.

19

మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడల ననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడి.

20

నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతిదినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును.

21

అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి, తామనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుస రింపకయు, నా విధులను గైకొన కయు, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచిరి గనుక, వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి నా కోపము వారిమీద తీర్చుకొందునని యనుకొంటిని.

22

అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనులలోనుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని.

23

మరియు వారు నా విధుల ననుస రింపక నా కట్టడలను తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచి,

24

తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింప గోరగా, అన్యజనులలో వారిని చెదరగొట్టి సకలదేశముల లోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసితిని.

25

నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రదుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని.

26

తొలి చూలిని అగ్నిగుండముదాటించి బలి దానముల నిచ్చుటచేత తమ్మును తాము అపవిత్రపరచు కొననిచ్చితిని.

27

కాబట్టి నర పుత్రుడా, ఇశ్రాయేలీ యులతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా మీ పితరులు నాయెడల అతిక్రమముచేసి నన్ను దూషించి

28

వారికిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశము లోనికి నేను వారిని రప్పించిన తరువాత, ఎత్తయిన యొక కొండనేగాని, దట్టమైన యొక వృక్షమునేగాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు, అర్పణలను అర్పించుచు, అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు, పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి.

29

మీరు పోవుచున్న ఉన్నతస్థలము లేమిటని నేనడిగితిని; కాబట్టి ఉన్నతస్థలమను పేరు నేటి వరకు వాడుకలో నున్నది.

30

కావున ఇశ్రాయేలీ యులకు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే;

31

నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించునప్పుడు, మీరు పెట్టుకొనిన విగ్రహము లన్నిటికి పూజజేసి అపవిత్రులగుచున్నారే; ఇశ్రాయేలీ యులారా, నాయొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడు నావలన ఆలోచన మీకు దొరుకదు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు

32

అన్యజనులేమి భూమిమీది యే జనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజచేతుమని మీ రనుకొనుచున్నారే. మీరు ఇచ్ఛయించినదాని ప్రకారమెన్నటికిని జరుగదు.

33

నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు, బాహు బలముతోను చాచిన చేతితోను నేను మీపైన అధికారము చేసెదను.

34

మరియు నేను రౌద్రము కుమ్మరించుచు, బాహు బలముతోను చాచిన చేతితోను మిమ్మును చెదరగొట్టిన ఆ యా దేశము లలోనుండియు జనులలో నుండియు నేను మిమ్మును సమకూర్చి

35

జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి, అక్కడ ముఖా ముఖిగా మీతో వ్యాజ్యెమాడెదను; ఇదే యెహోవా వాక్కు.

36

ఐగుప్తీయుల దేశపు అరణ్యములో నేను మీ పితరుల తో వ్యాజ్యెమాడి నట్టు మీతోను వ్యాజ్యెమాడెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

37

చేతి కఱ్ఱ క్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపర చెదను.

38

మరియు నామీద తిరుగబడువారిని దోషము చేయువారిని మీలో ఉండకుండ ప్రత్యేకించెదను, తాము కాపురమున్న దేశము లోనుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు వారు ఇశ్రాయేలు దేశము లో ప్రవేశిం చరు.

39

ఇశ్రాయేలు యింటివారలారా, మీరు నామాట వి నని యెడల మీరు పెట్టుకొనిన విగ్రహములను, మీ కిష్టమైనట్టుగా పూజించుకొనుడి, గాని మీ అర్పణలచేతను మీ విగ్రహములచేతను నా పరిశుద్ధ నామమును అపవిత్ర పరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.

40

నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీయు లందరును నాకు సేవచేయుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన యర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములగు మీ కానుకలనన్నిటిని నేనంగీకరించెదను.

41

జనములలోనుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆ యా దేశములలోనుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళధూపముగా మిమ్మును అంగీకరించెదను, అన్యజనులయెదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును.

42

మీ పితరులకిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించునప్పుడు నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.

43

అచ్చట చేరి మీ ప్రవర్తనను, మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనిన మీ క్రియలన్నిటిని మనస్సునకు తెచ్చుకొని, మీరు చేసిన దుష్‌క్రియలనుబట్టి మిమ్మును మీరే అసహ్యించుకొందురు.

44

ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతనుబట్టియు మీ కాని చేష్టలనుబట్టియు కాక నా నామమునుబట్టియే నేను మీ కీలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.