అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱ మేకలలోను తొలిచూలు వాటిని తీసికొని రావలెను.
మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మునాశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములును మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి మీ చేతిపనులన్నిటి యందు సంతోషింపవలెను.
నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైన దంతయు చేయకూడదు.
నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు.
మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టునుండు శత్రువులందరు లేకుండ మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందునప్పుడు
నేను మికాజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమభాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసికొని రావలెను.
నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనునట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలోగాని నీ ద్రాక్షారసములోగాని నీ నూనెలోగాని పదియవ పంతును, నీ పశువులలోగాని గొఱ్ఱ మేకలలోగాని తొలిచూలు వాటిని తినవలెను.
మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా నున్నందున, నీవు వాటిని మోయలేనియెడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు, వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని,
నీ దేవుడైన యెహోవా యేర్పరచుకొను స్థలమునకు వెళ్లి నీవు కోరు దేనికైనను
ఎద్దులకేమి గొఱ్ఱలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను.
లేవీయులను విడువకూడదు; నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు.
వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండ కానుకలను పదియవ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి; లేవీయుడైన కొనన్యా వాటిమీద విచారణకర్తగా నియమింపబడెను; అతని సహోదరుడైన షిమీ అతనికి సహకారిగా ఉండెను.
మరియు నీవు వారితో మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపువచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను.
మరియు లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందకపోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని
నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి, వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని.
మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను.
ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.