కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువచేసి , నీ కామవికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను .
నీదుర్మార్గము వెల్లడి చేయబడకముందు నీవు గర్వించి యున్నప్పుడు నీ చెల్లెలగు సొదొమ ప్రస్తావమెత్తక పోతివి.
ఆ సరిహద్దు పడమరగా బాలానుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండ యొక్క ఉత్తరపు వైపునకుదాటి బేత్షెమెషువరకు దిగి తిమ్నావైపునకు వ్యాపించెను.
అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయనే యీ గొప్ప కీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోని యెడల ఆయన మనలను మొత్త లేదనియు , మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.
జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి
బేత్దాగోను నయమా మక్కేదా అనునవి, వాటి పల్లెలు పోగా పదియారు పట్టణములు.
మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు
సమ్సోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను.