
అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును
వాటి చుట్టునున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటుచేసి సిద్ధపరచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను.
కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపముచొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.
అప్పుడు కొండ మీద నీకు కనుపరచబడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.
యాజకుడునగు యెహెజ్కేలు నకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను .
ఆత్మ నన్నెత్తి తోడు కొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు , యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను .
అక్కడ యెహోవా హస్తము నామీదికి వచ్చి , నీవు లేచి మైదానపు భూమికి వెళ్లుము , అక్కడ నేను నీతో మాటలాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను .