ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు మునుపు వారిమీద అధికారియై యుండెను, యెహోవా అతనితోకూడ నుండెను.
ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయువారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతా ధిపతులను పిలువనంపించి , యెహోవా మందిరములోనికి వారిని తీసికొని పోయి , యెహోవా మందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి , వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞాపించెను
శతా ధిపతులు యాజకుడైన యెహోయాదా తమ కిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి , ప్రతి మనిషి తన తన మనుష్యులను తీసికొని విశ్రాంతిదినమున లోపల ప్రవేశింపవలసిన వారితోను, విశ్రాంతిదినమున బయలుదేరవలసిన వారితోను కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను .
రాజదేహసంరక్షకుల అధిపతి ప్రధానయాజకుడైన శెరాయాను రెండవ యాజకుడైన జెఫన్యాను ముగ్గురు ద్వార పాలకులను పట్టుకొనెను.
అయితే అహరోనును అతని సంతతివారును దహన బలిపీఠముమీదను ధూపపీఠముమీదను ధూపమువేయుచు, అతిపరిశుద్ధస్థలపు పనినంతటిని జరుపుచుండవలెననియు, దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటిచొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయెను.
అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,
అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య,
జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు,
అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.
అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి.
యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను.
అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.
అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,
కెమూయేలు కుమారుడైన హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉండెను, సాదోకు ఆహరోనీయులకు అధిపతిగా ఉండెను.