ఫిలిష్తీయులు యుద్దముచేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి . అప్పుడు అత్య ధికమైన వధ జరిగెను ; ఇశ్రాయేలీయులలో ముప్పది వేల కాల్బలము కూలెను .
మరియు దేవుని మందసము పట్టబడెను ; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీయొక్క యిద్దరు కుమారులు హతులైరి .
దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గర నున్న పీఠము మీదనుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను ; ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహియై యుండెను. అతడు నలువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను.
మీరు కీడుచేయువా రైతే తప్పకుండ మీరును మీ రాజును నాశనమగుదురు .
నీతిమంతులును జ్ఞానులును వారి క్రియలును దేవుని వశమను సంగతిని, స్నేహము చేయుటయైనను ద్వేషించుటయైనను మనుష్యుల వశమున లేదను సంగతిని, అది యంతయు వారివలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింప బూనుకొంటిని.
సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభవించును; నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికిని బలులనర్పింపని వారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును; ఒట్టుపెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికిని ఆలాగుననే జరుగును.
నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండ నీ రాజు ఏమాయెను ? రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివిగదా; నీ అధిపతులు ఏమైరి ?
కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని ; క్రోధముకలిగి అతని కొట్టివేయుచున్నాను .