
మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదయినది , అతనిని చూచినవాడు ఎవడయినది నిశ్చయముగా తెలిసికొనుడి ; అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక
మీరు బహు జాగ్రత్తగా నుండి, అతడుండు మరుగు తావులను కనిపెట్టియున్న సంగతి యంత నాకు తెలియజేయుటకై మరల నాయొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వత్తును , అతడు దేశములో ఎక్కడనుండి నను యూదా వారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును.
తామున్న పల్లెలయందలి మాటుచోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును.
గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచి యుందురు బాధపడువారిని పట్టుకొన పొంచి యుందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు.
కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారమువలన నిరాధారులు కూలుదురు.
భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురు వారినిచూచి పండ్లు కొరుకుదురు.
వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు.
దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు
లేఖికుడైన బారూకును ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెరహ్మయేలునకును అజ్రీయేలు కుమారుడైన శెరాయాకును అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవా వారిని దాచెను.
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి – క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.
అందుకు వారు – యూదయ బేత్లెహేములోనే; ఏల యనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి.
అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,
ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని
– మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను.
కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.
మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాస ముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి.
అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండిమీకేమియు తెలియదు.
మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.
తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక
యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.
కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలో చించుచుండిరి.
ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.
వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును వచ్చి మేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము.
కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనినిగూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవిచేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి.
అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను.
అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచి ఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడుకొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను.
శతాధిపతి సహస్రాధిపతియొద్ద కతని తోడుకొనిపోయి ఖైదీయైన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలెననియున్న యీ పడుచువానిని నీయొద్దకు తీసికొనిపొమ్మని నన్ను అడిగెనని చెప్పెను.
సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసికొనిపోయి నీవు నాతో చెప్పుకొనవలెనని యున్నదేమని యొంటరిగా అడిగెను.
అందుకతడు నీవు పౌలునుగూర్చి సంపూర్తిగా విచారింపనట్టు అతనిని రేపు మహాసభయొద్దకు తీసికొనిరావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టియున్నారు.
వారి మాటకు నీవు సమ్మతింపవద్దు; వారిలో నలువదిమందికంటె ఎక్కువ మనుష్యులు అతనికొరకు పొంచియున్నారు. వారు అతని చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనియున్నారు; ఇప్పడు నీయొద్ద మాట తీసికొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను.
అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితివని యెవనితోను చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను.
తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తనయొద్దకు పిలిచి కైసరయవరకు వెళ్లుటకు ఇన్నూరుమంది సైనికులను డెబ్బదిమంది గుఱ్ఱపురౌతులను ఇన్నూరుమంది యీటెలవారిని రాత్రి తొమి్మది గంటలకు సిద్ధపరచి
పౌలును ఎక్కించి అధిపతియైన ఫేలిక్సు నొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధపరచుడని చెప్పెను.
మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను
మహా ఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.
యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని.
వారు అతనిమీద మోపిననేరమేమో తెలిసికొనగోరి నేను వారి మహాసభయొద్దకు అతనిని తీసికొనివచ్చితిని.
అందుకు ఆ మనుష్యుడు–ఇక్కడనుండి వారు సాగివెళ్లిరి. వారు–దోతానుకు వెళ్లుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను.