Therefore
1 సమూయేలు 28:21

అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి , అతడు బహుగా కలవరపడుట చూచి -నా యేలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసితిని.

యోబు గ్రంథము 18:7-11
7

వారి పటుత్వముగల నడకలు అడ్డగింపబడును వారి స్వకీయాలోచన వారిని కూల్చును.

8

వారు వాగురలమీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును.

9

బోను వారి మడిమెను పట్టుకొనును వల వారిని చిక్కించుకొనును.

10

వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును.

11

నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును భయములు వారిని వెంటాడి తరుమును.

కీర్తనల గ్రంథము 48:4

రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి.

కీర్తనల గ్రంథము 48:5

వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్లిపోయిరి.

యెషయా 57:20

భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.

యెషయా 57:21

దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు.

మత్తయి 2:3-12
3

హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితోకూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.

4

కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి – క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.

5

అందుకు వారు – యూదయ బేత్లెహేములోనే; ఏల యనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి.

6

అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,

7

ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని

8

– మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను.

9

వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను.

10

వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి,

11

తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.

12

తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.

Will ye not
1 సమూయేలు 22:8

మీరెందుకు నామీద కుట్రచేయుచున్నారు ? నా కుమారుడు యెష్షయి కుమారుని తో నిబంధనచేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియజేయ లేదే . నేడు జరుగునట్లు నా కొరకు పొంచి యుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింత లేదే .