దావీదు ఈటెలను
1 సమూయేలు 21:9

యాజకుడు -ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది , అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునులేదు , దాని తీసికొనుటకు నీకిష్టమైన యెడల తీసికొను మనగా దావీదు -దానికి సమమైనదొకటియు లేదు , నా కి మ్మనెను .

2 సమూయేలు 8:7

హదదెజెరు సేవకులకున్న బంగారు డాళ్లు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.

1దినవృత్తాంతములు 26:26

యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల యింటి పెద్దలును సహస్రాధిపతులును శతాధిపతులును సైన్యాధిపతులును

1దినవృత్తాంతములు 26:27

యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయువారైరి.

2 దినవృత్తాంతములు 5:1

సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనియంతయు సమాప్తముచేసి, తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను.

2 దినవృత్తాంతములు 23:9

మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను.

2 దినవృత్తాంతములు 23:10

అతడు ఆయుధము చేత పట్టుకొనిన జనులందరిని మందిరపు కుడివైపునుండి యెడమవైపువరకు బలిపీఠము ప్రక్కను మందిరముప్రక్కను రాజుచుట్టును ఉంచెను.