మీరు నిర్దోషులు
1 సమూయేలు 12:3

ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా ? ఎవని గార్దభమునైన పట్టుకొంటినా ? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా ? న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా ? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తుననెను.

యెషయా 5:3
కావున యెరూషలేము నివాసులారా, యూదావార లారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చ వలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.
కుట్రచేసి
2 రాజులు 9:14-24
14

ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాముమీద కుట్రచేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలువారందరును సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామోత్గిలాదు దగ్గర కావలి యుండిరి.

15

అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనులవలన తాను పొందిన గాయములను బాగు చేసి కొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతట యెహూ నీకనుకూలమైతే ఈ సంగతి తెలియ బడకుండునట్లు ఈ పట్టణములోనుండి యెవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనియ్యకుమని ఆజ్ఞ ఇచ్చి

16

రథముయెక్కి, యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి యుండెను.

17

యెజ్రెయేలు గోపురముమీద కావలివాడు నిలిచి యుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమని వానితో సెలవిచ్చెను.

18

కాబట్టి యొకడు గుఱ్ఱ మెక్కిపోయి అతనిని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ సమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలిసికొనెను గాని తిరిగి రాక నిలిచెనని సమాచారము తెలిపెను.

19

రాజు రెండవ రౌతును పంపగా వాడు వారియొద్దకు వచ్చి సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ సమధానముతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను.

20

అప్పుడు కావలివాడు వీడును వారిని కలిసికొని తిరిగిరాక నిలిచెను మరియు అతడు వెఱ్ఱి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీకుమారుడైన యెహూ తోలడమువలెనే యున్నదనెను.

21

రథము సిద్ధము చేయుమని యెహోరాము సెలవియ్యగా వారు అతని రథము సిద్ధముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోరామును యూదారాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి.

22

అంతట యెహోరాము యెహూను చూచి యెహూ సమాధానమా? అని అడుగగా యెహూ నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగితనములును ఇంత యపరిమితమై యుండగా సమాధాన మెక్కడనుండి వచ్చుననెను.

23

యెహోరాము రథము త్రిప్పి అహజ్యా, ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను.

24

అప్పుడు యెహూ తన బలముకొలది విల్లు ఎక్కు పెట్టి యెహోరామును భుజములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండ దూసి పోయెను గనుక అతడు తన రథమునందే యొరిగెను.

హొషేయ 1:4

యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను -ఇతనికి యెజ్రెయేలని పేరుపెట్టుము . యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును , ఇశ్రాయే లువారికి రాజ్యముండకుండ తీసివేతును .