ఆ మనుష్యులు
సామెతలు 25:13

నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనమువంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును.

లూకా 16:8

అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటె (మూలభాషలో-వెలుగు కుమారులకంటె) ఈ లోక సంబంధులు (మూలభాషలో-ఈ యుగపు కుమారులు) తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులైయున్నారు.

and he caused
2 రాజులు 10:15

అచ్చటినుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశలప్రశ్నలడిగి—నీయెడల నాకున్నట్టుగా నాయెడల నీకున్నదా అని అతని నడుగగా యెహోనాదాబు—ఉన్నదనెను. —ఆలాగైతే నా చేతిలో చెయ్యి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యివేసెను. గనుక యెహూ తన రథము మీద అతనిని ఎక్కించుకొని

అపొస్తలుల కార్యములు 8:31

అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను.