యోనాతాను -ఈ సున్నతిలేనివారి దండు కాపరులమీదికి పోదము రమ్ము , యెహోవా మన కార్యమును సాగించునేమో , అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయు వానితో చెప్పగా
యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి-మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను -నా వెనుక రమ్ము , యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి
అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతుల తోను కాళ్ల తోను ప్రాకి యెక్కిరి . ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతనివెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను .
నా దగ్గరకు రమ్ము , నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదు తో అనగా
దావీదు -నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను .
ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును ; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ; ఇశ్రాయేలీయులలో దేవు డున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును .
అప్పుడు యెహోవా కత్తిచేతను ఈటెచేతను రక్షించువాడు కాడని యీ దండు వారందరు తెలిసికొందురు ; యుద్ధము యెహోవాదే ; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను.
రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.
మరియు నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయమొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి.
గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కఱ్ఱకానివానిని ఎత్తినట్లును ఉండును గదా?
ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలిసిన అష్షూరీయులమీదికి క్షయరోగము పంపును వారిక్రింద అగ్నిజ్వాలలుగల కొరవికట్టె రాజును.
అందుకు పేతురునీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా
యేసు అతని చూచిఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
పేతురాయనను చూచినేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.