
పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినును; బీడుభూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశపక్షులు తినును అనెను.
నీవు అతని చూచి యీలాగు ప్రకటించుము యెహోవా సెలవిచ్చునదేమనగా దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివిగదా. యెహోవా సెలవిచ్చునదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను.
మరియు యెజెబెలునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును.
పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును; బయటిభూములలో చచ్చువారిని ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను
వారు పోయి నామీద తిరుగుబాటు చేసినవారి కళేబరములను తేరి చూచెదరు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.
యెహోవా వాక్కు ఇదేచంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను.
నర పుత్రుడా , ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సకలజాతుల పక్షులకును భూ మృగముల కన్నిటికిని యీ సమాచారము తెలియజేయుము నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కులనుండి కూడి రండి ; ఇశ్రాయేలీయుల పర్వతముల మీద నొక గొప్ప బలి జరుగును, మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు ;
బలాఢ్యుల మాంసము తిందురు , భూపతుల రక్తమును , బాషానులో క్రొవ్విన పొట్లేళ్ల యొక్కయు గొఱ్ఱపిల్లల యొక్కయు మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తము త్రాగుదురు .
నేను మీ కొరకు బలి వధింప బోవుచున్నాను, మీరు కడుపార క్రొవ్వు తిందురు , మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు .
మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని.
అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి -రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరియొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.