కూర్చుండగా
1 రాజులు 19:4

తాను ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి యొక బదరీవృక్షముక్రింద కూర్చుండి, మరణాపేక్షగలవాడై యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను, ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము అని ప్రార్థనచేసెను.

యోహాను 4:6

అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.

యోహాను 4:34

యేసు వారిని చూచినన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.

1 కొరింథీయులకు 4:11

ఈ గడియవరకు ఆకలిదప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేక యున్నాము;

1 కొరింథీయులకు 4:12

స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింపబడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము;

2 కొరింథీయులకు 11:27

ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలిదప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.

ఫిలిప్పీయులకు 4:12

దీనస్థితిలో ఉండ నెరుగుదును , సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును ; ప్రతివిషయము లోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును , సమృద్ధికలిగియుండుటకును లేమిలోఉండుటకును నేర్చు కొనియున్నాను .

ఫిలిప్పీయులకు 4:13

నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను .