an hold
1 సమూయేలు 22:1

దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహ లోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటి వారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి .

1 సమూయేలు 22:4

అతనియొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగియున్న దినములు వారు అతనియొద్ద కాపురముండిరి .

1 సమూయేలు 22:5

మరియు ప్రవక్తయగు గాదు వచ్చి-కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపొమ్మని దావీదు తో చెప్పినందున దావీదు పోయి హారెతు అడవిలో చొచ్చెను .

1 సమూయేలు 24:22

అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను ; అయితే దావీదును అతని జనులును తమ కొండస్థలములకు వెళ్లిపోయిరి .

1దినవృత్తాంతములు 12:16

మరియు బెన్యామీనీయులలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి.

garrison
1 సమూయేలు 10:5

ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు , అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే , స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగి వచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును , వారు ప్రకటనచేయుచు వత్తురు;

1 సమూయేలు 13:4

సౌలు ఫిలిష్తీయుల దండును హతముచేసి నందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడివచ్చిరి .

1 సమూయేలు 13:23

ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి .

1 సమూయేలు 14:1

ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమియు చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలివారిని హతముచేయ పోదము రమ్మనెను .

1 సమూయేలు 14:6

యోనాతాను -ఈ సున్నతిలేనివారి దండు కాపరులమీదికి పోదము రమ్ము , యెహోవా మన కార్యమును సాగించునేమో , అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయు వానితో చెప్పగా