వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగానున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.
పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును.
వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.
వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.
భక్తుడు దేశములో లేకపోయెను , జనులలో యథార్థపరుడు ఒకడును లేడు , అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే ; ప్రతిమనుష్యుడును కిరాతుడై తన సహోదరునికొరకు వలలను ఒగ్గును.
ఆయనను అప్పగించువాడునేనెవరిని ముద్దుపెట్టుకొందునో ఆయనే యేసు; ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి
వెంటనే యేసు నొద్దకు వచ్చిబోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.
ఆయన ఇంకను మాటలాడుచుండగా , ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. పండ్రెండు మందిలో యూదా అనబడినవాడు వారికంటె ముందుగా నడిచి , యేసును ముద్దుపెట్టుకొనుటకు ఆయనయొద్దకు రాగా
యేసు - యూదా , నీవు ముద్దుపెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా